Happy birthday Manic Bhanu 🙂
టెండూల్కర్ రిటైర్ అయినాక క్స్రికెట్ మీద ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోయింది ...దేవుడు ఆడినన్నాళ్లు గెలుపు ఓటములును బాగా భావొద్వేగాలతో తీసుకున్నాను ...నాలానే చాలా మంది ...ఇప్పుడు అంతగా ఫాలో అవ్వట్లేదు ..:అయినా వరల్డ్ కప్ గెలిచినప్పుడు చాలా ఆనందించాము...3-0వ టెస్టు సిరీస్ ఓడిపోవడం అంటే బాధాకరం. అయితే ఎందుకో అంత బాధ అనిపించలేదు...ఎందుకో అనుకున్నాను...మొదటి నుంచి విండీస్, కివీస్ అంటే కొంచెం సాఫ్ట్‌వేర్ కార్నర్ అన్నట్టు..ఆంబ్రోస్, లారా అయినా హడ్లీ, గ్రేట్‌బ్యాచ్ అయినా ఇష్టంగా ఉండేది...వాళ్ళతో ఓడిపోయినా...అంతలా అనిపించిందికాదు. ..మనం కాకపోతే నెక్స్ట్ వీళ్ళు గెలవాలి అనుకునే వాళ్ళం...కివీస్ ప్రశాంతం అని పేరు...ప్రపంచమంతా కల్లోలంగానో, లేక దిల్ సుఖ్ నగర్ , కోటి బస్ స్టాండుల్లా చాలా హడవుడిగా ఉంటుందంటే, Nz మాత్రమే యూనివర్సిటీ క్యాంపస్ లోలా అందులో లైబ్రరీలోలాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది... మనకి తెలిసిన మన భాను వేరు...స్నేహానికి ప్రాణమిచ్చే వాడు...ప్రాణం కాకపోయిన వాడు తినకుండా సమోసా ఇచ్చెంత గొప్ప మనసున్న వాడు...ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ లా జోకులేస్తూ...తమ్ముడు లో పి కే లాగా లైఫ్ అలా అలా గడిపేసేవాడు...