Happy birthday Manic Bhanu 🙂
టెండూల్కర్ రిటైర్ అయినాక క్స్రికెట్ మీద ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోయింది ...దేవుడు ఆడినన్నాళ్లు గెలుపు ఓటములును బాగా భావొద్వేగాలతో తీసుకున్నాను ...నాలానే చాలా మంది ...ఇప్పుడు అంతగా ఫాలో అవ్వట్లేదు ..:అయినా వరల్డ్ కప్ గెలిచినప్పుడు చాలా ఆనందించాము...3-0వ టెస్టు సిరీస్ ఓడిపోవడం అంటే బాధాకరం. అయితే ఎందుకో అంత బాధ అనిపించలేదు...ఎందుకో అనుకున్నాను...మొదటి నుంచి విండీస్, కివీస్ అంటే కొంచెం సాఫ్ట్‌వేర్ కార్నర్ అన్నట్టు..ఆంబ్రోస్, లారా అయినా హడ్లీ, గ్రేట్‌బ్యాచ్ అయినా ఇష్టంగా ఉండేది...వాళ్ళతో ఓడిపోయినా...అంతలా అనిపించిందికాదు. ..మనం కాకపోతే నెక్స్ట్ వీళ్ళు గెలవాలి అనుకునే వాళ్ళం...కివీస్ ప్రశాంతం అని పేరు...ప్రపంచమంతా కల్లోలంగానో, లేక దిల్ సుఖ్ నగర్ , కోటి బస్ స్టాండుల్లా చాలా హడవుడిగా ఉంటుందంటే, Nz మాత్రమే యూనివర్సిటీ క్యాంపస్ లోలా అందులో లైబ్రరీలోలాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది...
మనకి తెలిసిన మన భాను వేరు...స్నేహానికి ప్రాణమిచ్చే వాడు...ప్రాణం కాకపోయిన వాడు తినకుండా సమోసా ఇచ్చెంత గొప్ప మనసున్న వాడు...ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ లా జోకులేస్తూ...తమ్ముడు లో పి కే లాగా లైఫ్ అలా అలా గడిపేసేవాడు...టీచర్ల పనిష్మెంట్లు ఆనందంగా స్వీకరుంచేవాడు...స్కేల్ దెబ్బలు తిన్నా మొహంలో చిరునవ్వు తరిగేది కాదు...ఇలా కూడా ఉండచ్చా అని నెత్తిన కాప్ వేసుకొని విస్తు పోయి చూసేవాళ్ళం. .. అలా అని భాను సాఫ్ట్‌వేర్ అనుకోనేరు...ఎంబెడెడ్ ఫర్మ్‌వేర్ మరియు హార్డ్‌వేర్...ఎవడన్నా జోలికొస్తే...అందులో ఫ్రెండ్స్ జోలికొస్తే ఊరుకునేవాడు కాదు...అతడులో మహేష్ బాబూ గొప్పగా చూపించాడు సినిమాలో ...ఇక్కడ మహేష్ భాను నిజంగా చూపించేవాడు...వీడ్ని చూస్తే భయం వేసేది...అర్జునుడు,భీముడు ఏకమయ్యె వాళ్ళు...కౌరవులు వందమందైనా దిగదుడుపే...
కట్ చేస్తే మాణిక్ భాను ఇప్పుడు ఉత్త భాను ప్రసాద్...వింటర్ లో బంగాళాఖాతం అలలు ప్రశాంతంగా ఒక దాని తరువాత ఒకటి రిథమిక్ గా వచ్చి వెళ్తూ ఉన్నట్టు ఎక్కడో న్యూజీలాండ్ లో అన్నీ ఒదిలేసి అదేదో బిగ్ బాస్ సినిమాలో చిరు అయ్యప్ప మాల వేసుకున్నట్టు చాలా సాఫ్ట్ వేర్ గా మారిపోయాడు... ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో రెండు తెలిసినవాడు మన భాను...నువ్విలాగే సంతోషంగా, ఆనందంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలni ఆ భగవంతునితో పాటు పాటు షేన్ బాండ్ ని ప్రార్థిస్తూ happy birthday my friend 🙂
Really grateful to have a friend like you who can spend so much time writing beautiful stories like this.. Thsnks Satya, you are an amazing talent.. Bhanu
ReplyDeleteNice of you, the writer exactly expressed ,described about Bhanu The Sun & the best Son as well
ReplyDelete