బద్ధకస్తులు కారణజన్ములు

 బద్ధకం అనేది పురాతన కాలం నుండి ఉన్నదని, డైనోసోర్లు బద్ధకం వదిలేయడం వల్లనే అంతరించిపోయాయని న్యూ జీలాండ్లో బిభా నుప్ర సాదు అనే శాస్త్రవేత్త ఎంతో రీసెర్చ్ చేసి చెప్పారు

సదా ధ్యానం లో ఉండె ఆ సదాశివుని తేజస్సులోని ఆ పరమానందములో భాగమే ఈ బద్ధకము అని ప్రముఖ ప్రవచన శ్రీ, తత్వవేత్త, శ్రీ శ్రీ శ్రీ రాపోలు శ్రీకాంతాచార్యులు సెలవిచ్చారు

యోగాలో బద్ధకాసనమనేది యోగశాస్త్రంలో ఎప్పటినుంచో చెప్పబడి ఉన్నది. శవాసనంలో శరీరం కదిలించకుండా ఎలాగైతే విశ్రమిస్తామో అలాగే బద్ధకాశనంలో కూడా మనస్సు, శరీరం విశరామిస్తాయి. దీని వలన అవయవాలాన్నీ ఎక్కువ రోజులు మాన్నికగా ఉంటాయని ప్రముఖ యోగా నిపుణులు శ్రీ రంగ సాయి గారు తెలియజేసారు


ప్రపంచంలో ప్రజలు తమ దైనందిక జీవితంలో బద్ధకాన్ని భాగంగా చేసుకోవాలని, సమాజ శ్రేయస్సుకు ఇది ఎంతగానో తోడ్పాడుతుందని, బద్ధకస్థులంతా ఒక కూటమిగా ఏర్పడి బద్ధకం వల్ల వచ్చే ఉపయోగాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలని చైతన్యవంతులని చెయ్యాలని కంకణం కట్టుకున్న ప్రముఖ సామాజిక వేత్త బద్ధకబ్రహ్మ శ్రీ జ్ఞానేశ్వర్ రెడ్డి అర్ టీ సీ కాలనీ లో జరిగిన సభలో ఆవేశంగా చెప్పారు


రేయ్ రేయ్ రేయ్ నేను ఒక్కసారి లేచానంటే వెయ్యి సార్లు లేచినట్టే అన్నాడు రజిని


తెలుగు వీర లేవకురా, లేచి చేసేదేమీ లేదురా అన్నాడు కొండాపురం మహేష్


బద్ధకమే శ్రామికుని అంతిమ లక్ష్యం, పని, పని అని పరిగెత్తి నీవు సాధించినదేమున్నది, పని చేయక బద్ధకస్తుడ నేను సాధించనిదేముంది అన్నారు విప్లవకవి శ్రీ శ్రీ


పని చెయ్యడం, పని చెయ్యకుండా ఉండలేకపోవడమానేది ఒక మానసిక లక్షణం. ఒక వ్యక్తి పనికి బానిసగా మరి అది ఆడిస్తిన్నట్టు ఆడడం అనేది కాలక్రమేణా చాలా ప్రమాదకరం. దీనిని ఆదిలోనే ఆణి చెయ్యాలని, ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ఎంతగానో ఉంటుందని, వారు మహా బద్ధకస్థులయి పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉండాలని మంచిమాట కార్యక్రమంలో మాట్లాడుతూ, నగరంలోని ప్రముఖ పిల్లల వైద్యురాలు శ్రీమతి Dr హిమ బిందు చెప్పారు


బద్ధకం అనేది ఒక కళాకారునికి చాలా ముఖ్యం. ఎంతో బద్ధకంగా ఉంటే తప్ప ఏకాగ్రత నిలపడం కష్టమని, బద్ధకం పెంపొందించుకోడానికి బద్ధకసాధనం చెయ్యాలని, సాధనమున పనులు సమకూరు ధర లోన అని ప్రముఖ చిత్రకారుడు ఇశాక్ రాజు బెంగళూరు లో జరుగుతున్న ఆర్ట్స ఎగ్జిభిషన్ లో మటలాడుతూ తెలిపారు


బద్ధకం ఒక ఘనమైన యోగం అని, గ్రహాలన్నీ కలిసి ఎంతో అరుదైన ఒక స్థానక్రమం లో ఉంటేనే ఇలాంటి గొప్ప యోగం లభిస్తుందని, పరాశార జ్యోతిష్య శాస్త్రం లో చెప్పబడిందని అమెరికాలో గొప్ప జ్యోతిష్యురాలు శ్రీ సీత గారు విశదీకరించారు


బద్ధకం అనేది ఒక క్రీడ అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ కదలకుండానే కదలకుండా ఎలా ఉండాలి అని నిరంతరం ఆలోచిండామనేది ఒక క్రీడ. దీనికంటూ రూల్స్ రూపందిస్తునామని, త్వరలోనే ఇది ఒక క్రీడారూపం దాలుస్తుందని, 2071 కల్లా ఇది ఒలింపిక్స్ లో స్థానం సమకూర్చుకుంటుందని మాజీ క్రికెటర్ శ్రీ చెన్నా రెడ్డి గారు ఇంగ్లాండ్ లో విలేఖరులతో ఇష్టగోష్టిగా మాట్లాడుతూ సెలవిచ్చరు
























Comments

Popular posts from this blog

happy birthday Manoj N L :)

Happy birthday archana 🙂

Sobhakritha naama Ugadi raasi phala