శశి, సినిమా
సినిమా అంటే అందరికీ ఇష్టం. సినిమా లో పాత్రలు నిజజీవితం లో లాగా ఉండవు..:స్పెషల్ గా ఉంటాయి..:అలా ఉంటేనే ఎక్కువ మంది ఆదరిస్తారు…సాధారణంగా జీవనం చేసేవారికి అసాధారణంగా ఉండే పాత్రలు ఇష్టం..:అందుకే శివ లో చైన్ తియ్యడం, తీసి పంచ్ చేయడం…రౌడీ మొహం మీద చాయ్ పొయ్యడం చాలా హిట్టు…రజని ఎలివేషన్స్ అన్నీ హిట్టే…అమితాబ్ ఒక పోలిష్ నుంచి పెద్ద డాన్ అవ్వడం…తొలిప్రేమ లో మార్కులు రాకపోయినా తమ్ముడులో బిందాస్ బతికేసినా మళ్ళా పట్టుదలతో విజయం సాధించడం మనకి నచ్చుతాయి…సినిమాలో ట్విస్ట్స్ ఉంటాయి..క్షణ క్షణంలో శ్రీదేవికి జరిగినట్టు లైఫ్ ఒక్కరోజులో రోలర్ కోస్టర్ లా తిరుగుతుంది…సాధారణంగా అందరికీ నిజ జీవితం లో సినిమా ఉండదు…ఏదో టీవీ లో డిక్యుమెంటరీ లా నడిచిపోతూ ఉంటుంది…మహా అయితే ఒక సినిమా ఉంటుంది.::ఎప్పుడో ఒక ట్విస్ట్ ఉంటుంది…చాలా వరకు కొంత డ్రామా కొంత కామెడీ ఉంటుంది…చాలా రేర్ గా కొంతమంది జీవితాల్లో ఒక ప్రేమికుల రోజు, ఒక భాషా, ఒక తమ్ముడు అన్నీ కలిసి ఉంటాయి…మనమందరము సినిమాలు చూస్తే వీళ్ళు ఆ పాత్రలు నిజ జీవితంలో జీవించేస్తారు…మన అన్నయ్య లాగా…మన శశి అలాంటి పలు సినిమాలు కలిపి …ఒక మల్టీప్లెక్సే నడి...