Happy birthday Asha 🙂

 అదోక తిరుపతి దెగ్గర చిన్న ఊరు...చలికాలం...కానీ ఊళ్ళో వాతావరణం చాలా వేడిగా, వాడిగా ఉంది…అక్కడ జి ఎన్ రెడ్డి గారి వర్గానికి, ఎస్ పీ రెడ్డి గారి వర్గానికి పెద్ద గొడవైంది...కత్తులు, కటార్లు, మెష్షులు, క్లాకులు, మెమొరీలు బయటకి వచ్చాయి... ఎవరి వాదనలు, టెస్ట్ కేసులు వారు పంచాయతీ ముందు పెట్టుకున్నారు...ఊరిలో సగం మందికి జీఎన్ఆర్లు, సగం మందికి ఎస్పీఆర్లు న్యాయమని అనిపించారు...పంచాయితీలో కూడా సగం అటు, ఇటు నిలిచారు...ఇంకా అధ్యక్షుడు రాఘవరావు గారు తీర్పివ్వాలి...ఆయన విదేశాల నుంచి వచ్చారు…తీర్పు ఇవ్వబోయారు...ఇంతలో జనంలో కలకలం మొదలైంది... ఓక పెద్దాయన సెలవిచ్చారు...రావు గారూ, మీరు గొప్ప సీనియర్ దర్శకులు...ఎన్నో తీర్పులిచ్చారు...కానీ ఇది చాలా జటిలమైనది...మీరు కాదు అని వారించారు...ఎవరో వెళ్లి కైకాల సత్యనారయణ గారిని పిలిపించారు...ఆయనగారు... యముండ అని గర్జించారు, వచ్చారు, చూసారు…కష్టం అని తేల్చేశారు...ఇంతలో ఎవరో గుర్రపు బండిలో దిగారు... .పెద్ద మీసం, ఆజానుబాహుడు, చేతిలో పెద్ద ఖడ్గంతో బొబ్బిలి బ్రాహ్మన్న దిగాడు...ఓహో ఇది బొబ్బిలి కాదా...నా ఏరియా కాదు అని చెప్పి వెళ్ళిపోయారు...హ హ హా..మనిసన్నాక కూసింత కలపోసనుండాలి అని రావు గోపాలరావు గరొచ్చారు, చూసారు…అలో, అలో అంటూ ఏదో ఫోనొచ్చినవారిలా వెళ్లిపోయారు...లోకల్ లెజెండ్ మోహన్ బాబు గారు పేదరాయుడిలా వచ్చారు...ఒచ్చారు...చూసారు...కోర్ కి వెరిఫికేషన్ కి మధ్య సంబంధం, ఫిషూ, జాలరి లాంటిది నేను తలదూర్చాను అన్నారు...పెద్ద శబ్దమొచ్చింది...ఎవరో తోడగొట్టినట్టుగా... 180nm…130nm..90nm, 65nm, 40nm, 28nm, 14nm తరువాత వచ్చిన నానో మీటరేరా యీ 7nm బాలయ్యా అంటూ గర్జన వినిపించింది...మా నాన్నగారు గుర్తొచ్చారు ఇవాళ్ళ నేను ఓఓఓ అని చెప్పి వెళ్లిపోయారు......ఇంతలో పెద్ద సుడిగాలి... పెద్ద చుట్ట రింగులు తిరుగుతూ నోటిలో వాలింది...దానంతటదే వెలిగింది...సింహం నల్ల కళ్లద్దాలు పెట్టిందా అన్నట్టు ఒచ్చారు...రజనీ...రేయ్ రేయ్...ఫిజికల్ డిజైన్ అయితే నాకే చెప్పండ్రా...ఇది నా సిలబస్ కాదురా అని చెప్పి ఊపులో వెళ్ళిపోయారు...నిర్మలమ్మకి ఇంక విసుగు పుట్టింది..యీ గొడవ తీర్చేవారే లేరా? ఈ తీర్పు చెప్పేవాళ్ళే లేరా? ఆ ఊళ్ళో తపస్సు చేసుకుంటున్నా తనికెళ్ళ భరణిని అడిగారు...ఆయన చెప్పారు..ఒక్కరున్నారు...ఎవరి పేరు చెబితే కోరు, కోహెరెన్సీ రెండు ఏకమవుతాయో...ఎవరు పేరు చెబితే ప్రీ సిలికాన్, పోస్ట్ సిలికాన్ వాలిడేషన్ ఒకటే అవుతాయొద్దాయో... ఆ ఆశమ్మ రావాలి...అని చెప్పు ధ్యానం లోకి వెళ్లిపోయారు...ఆశా ని పిలిచారు...ఒచ్చి అలా కూర్చోగానే GNRలు, SPRలు వారి వారి టెస్టు కేసుల్లో బగ్గులు వారికే అర్థమైపోయింది...అంతా వాలిడేట్ అయింది...ఊరంతా సంబరాలు చేసుకున్నారు…Happy birthday Asha 🙂

Comments

  1. అల్ ఐస్ వెల్, ఠాట్ ఎండ్స్ వెల్

    ReplyDelete
  2. Telugu reading swalpa slow but aakhari line varaku cinema choosthunna feeling vacci

    ReplyDelete
  3. Chaal baagundi birthday movie story

    ReplyDelete
  4. Chala baga rasaru satya garu

    ReplyDelete
  5. Super ga vundi Satya-san

    ReplyDelete
  6. Awesome. Happy Birthday Asha

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

The Physical Design Geetha

happy birthday Manoj N L :)

Happy birthday archana 🙂