Summer memories

 మండే ఎండలు, కరెంటు కట్టులు, మార్నింగు స్కూళ్లు, వార్షిక పరీక్షలు, పరీక్షల అట్ట బాట్లతో క్రికెట్లు, మారంపీటీలు, బోలెడన్ని సెలవలు, అమ్మమ్మ వాళ్ల ఇంట్లో దాగుడు మూతల ఆటలు, గోలీలాటలు, గోలీసోడాలు , ఛాన్నీళ్ల స్నానాలు, పొద్దున్నే పెరుగన్నం ముద్దలు, బంగినపల్లి మామిడిపళ్ళు, రసాలు, మాట్నీ సినిమాలు, టీవీలో క్రిక్కెట్టు మ్యాచలు, హోళీ రంగులు, ఉగాది పచ్చడి, రామనవమి వేడుకలు, వేపచెట్టు నీడలు, సిటీ బస్సుకోసం ఎదురుచూపులు, బస్సులో ఉక్కపూతలు, రోడ్డు మీద ఎండమావులు, కొబ్బరి బొండాలు, నిమ్మకాయ నీళ్ళు, చెరకు రసాలు, ఐసు గడ్డలు, సాయంత్రం చల్లగాలులు, మిద్దె మీద పడకలు, ఉదయభానుడి పలకరింపులు, షార్టు క్రికెట్ మ్యాచ్‌లు , క్యారమ్ బోర్డు, చెస్సు, ఫ్రెండ్సు, బుక్ క్రికెటు, వైకుంఠపాళి, , పేకాటలు, బంధువులు, పెళ్లిళ్లు...చిన్ననాటి స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి...ఆహా వేసవికి స్వాగతం

Comments

Popular posts from this blog

The Physical Design Geetha

బద్ధకస్తులు కారణజన్ములు

Unplugged