నీ ఇష్టం లలితత్తా...నువ్వు రిటైర్డ్ ఇప్పుడు 🙂
కొత్తల్లో అలవాటుకొద్దీ చక చకా తయారయ్యి బాక్సట్టేసుకొనేసి మెట్రో ఎక్కేసీవు...ఆఫీస్ వాళ్ళు మొహమాటానికి రానిస్తారేమోగానీ వెళ్లనవసరం లేదు 🙂
ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడ్డావు...ఎన్నో సినిమాలు మిస్సయ్యి ఉంటావు...తీరిగ్గా చూససెయ్యి...పూజా పారాయణం అయ్యాకనేలే....కార్తీకదీపం సీరియల్లో మిస్సయిన ఎపిసోడ్స్ తిరగతోడేయ్యి...రకరకాల వంటల పుస్తకాల్లో రోజుకోరకం చేసి చూడు...చిరాకేసిన రోజు స్విగ్గె్కి ఆర్డరెట్టేయి..టీవీ లో రాజకీయ వాదోపవాదాలు వినాలనుకేవు..వాటి జోలికెళతే బీపీ వచ్చేస్తుంది...యూట్యూబ్లో జంధ్యాల బ్రహ్మానందం హాస్యం చూసుకో...ఇదే అవకాశం ఏ సంగీతమో, కవిత్వమో ఎప్పుడూ చేద్దామనుకొని చెయ్యలేని చిత్రాలేఖనమో చేసేసుకో...చదవడానికి తీరికలేక వదిలేసినా ఆ బారిష్టారు పార్వతీసం, వేయిపడగలు ప్రశాంతంగా చదివేసెయ్యి...మూడు నాలుగు దశాబ్దాలుగా కలవాలునుకున్న పాత మిత్రులందరినీ కలిసేయ్యి..:పారడైస్ దెగ్గర మేజబాన్ రెస్టారంట్ లో భోజనానికి ప్లాన్ చెయ్యి..ఇంట్లొ గడియారం తీసెయ్యి..నాలా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పే వాళ్లందరినీ పక్కనేట్టేసి ఏమీ చెయ్యకపోవడం అనే మహాత్కార్యాన్ని చేసెయ్యి...అది ఒక కళ..మొదట్లో కష్టంగా ఉన్నా, అందులోని మజానే వేరు...మధ్యాహ్నం భోజనం చేసాక చేతిలో పేపరేట్టుకోని తాతయ్యలాగా మాంఛి నిద్ర తీయడంలో ఉంది చూసావూ...మరీ బోరు కొడితే ఇనోరేబిట్టు మాల్ కెళ్ళి కిటికీ షాపింగ్ చేసెయ్యి...ఏదైనా చేసెయ్యి...ఏమీ చెయ్యకు...నీ ఇష్టం నువ్వు రిటైర్డ్ ఇప్పుడు 🙂
Nice Satya!
ReplyDeleteAwesome
ReplyDelete