Happy birthday archana 🙂

 శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్ల ఏకాదశి దివ్యమైన రోజు...‘మహానటి’ అని అందరూత్మీయంగా పిలుచుకునే మహారాణి శ్రీ శ్రీ శ్రీ సోదగం అర్చన గారు జన్మించిన రోజు. ఈ సంధర్బంగా ప్రజలంతా కొద్ది రోజుల ముందే ఎంతో ఖర్చు పెట్టి టపాకాయాలు కాల్చుకొని దీపావళి సంబరాలు చేసుకున్నారు. జనులంతా ఆర్టీసి బస్సుల్లో, రోడ్డు మీద వారి వారి గమ్యస్థానాలకు ఒరోరేగింపుగా వేడుతూ బేగంపేట సిగ్నల్స్  దెగ్గర ఆగి వేడుక చూసారు... తెల్లని కాబులు శ్వేతాశ్వాల వలే ఉత్సాహంతో ఆక్సి్లరేటర్ని ఉరికించాయి...

పాదచారులు తమ చేతుల్లోని స్మార్ట్ ఫోన్‌లలో టార్చులు, రింగుటోనులు, ఇన్‌స్టా రీళ్లు ప్లే చేస్తూ జియో ధ్వానాలు పలికారు...

ఎంతో మంది ప్రజలు తమ పరిసర పూటకూళ్ల రెస్టారెంట్లలో తమకు ఇష్టమైన వంటకాలు అడిగి, డబ్బులిచ్చి మరీ ఆరగించారు...ధనవంతులు బహు నక్షత్ర తారల హోటళ్ళ లో విందుభోజనం చేశారు 

ఎంతో మంది మెట్రో శ్వేతవాహనమున పయనిస్తూ అందులో నుంచున్నవారు చేయి పైకెత్తి హేండిల్ పట్టుకొని తమ హర్షం వ్యక్తం చేసారు...

పసుపు పచ్చని మూడు చక్రరథ సారథులు గతుకుల బాట పై చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శనగా చేసి చూపించారు...ట్రాఫిక్ విదూషకపోలీసులు తమ రోజంత నాట్యమాడు రీతిలో చేతులు తిప్పుతూ తమ విన్యాసాలను ప్రదర్శించారు...

పచ్చని స్కూల్ బస్సుల్లో వెళ్తూ బలబలికలు కిటికీ లోంచి బయటకి చూసూ తమ ఆనందాన్ని వెళ్ళడించారు

పట్టణమంతా చలనచిత్రలేఖన పోస్టర్లు వెలిశాయి…

ఈ టీవీ ల్లో పాడుతా తీయగా అంటూ పాటల పోటీలు నిర్వహించారు..పక్కనున్న పేరేడే గ్రౌండ్స్ లో పిల్లలు ఆటల పో్టీలలో పాల్గొన్నారు 

రాజా వారు ఎం బహుమతి ఇచ్చారో తెలియాదు గానీ మంచి విలువైనదే అని అభిజ్ఞ వర్గాల భోగట్టా యువరాణులిరువురూ ఆకాశైఫోనువాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు …బాల్య మిత్రులు వాట్సాపపావురంతో తమ తమ అభినందనలు తెలిపారు ...మొత్తం మీద బేగంపేట మహారాణీ వారి జన్మదిన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి..:సోదగుం మహారాణి వారు సదా ఆయురారోగ్య ఐశ్వర్యలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అందరూ కోరుతున్నారు

Comments

  1. OMG!!!! No words to show my gratitude Satya🙏🙂Thank u so much.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

The Physical Design Geetha

happy birthday Manoj N L :)