musings with soft drinks embedded...
12 soft drinks are embedded in this...find out which all...
ఇయ్యాల పొద్దుగాల్నే లేచినుంటి...గీ ల్యాప్‌టాప్ ఓపెన్ చెయ్యద్దురా సత్యా అంట...మల్లా ఓపెన్ సేస్తా...ఇప్పటికే ఏడు కొట్టంగానే కాల్సు...గీ లోపే పూజ చేస్కోరా భయ్ అనుకుంటా...ఒక్క రోజు సేస్కోలే...గిప్పుడేమో లేట్ అయిపాయే...ఇంత పొద్దున్నే లేచి ఇంతగనమ్ పని చేసి ఇంత లేటుగ బయల్దేరినమ్ చూసి చూసి ట్రాఫిక్ ల ...ఆహా mausam మాత్త్రం కతర్నాక్ ఉంది...బెంగళూరు కత్తి బాబాయ్ ఈ ట్రాఫిక్ లో క్లచ్ ఒత్తీ ఒత్తీ కాలు నొస్తుంది పో...అసలే అరికాలంతా పగిలింది చలికి...మనకి సెప్పులేస్కోని డ్రైవింగ్ అలవాటు లేదు...లింకాయింటుమెంటు రాసుకొని బాగుండి డ్రైవ్ చెస్తే బాగుండేది...ఈ ట్రాఫిక్‌కి రోజుకొక కొల్హాపూర్ చెప్పులు అరిగిపోతాయ్...క్లచ్ కి...ఆహ్...నీలే నీలే అంబర్ పార్..పాట...ప్యూర్ గోల్డ్...స్పోటిఫై ఆన్ చేసుకుని కిషోర్ దా పాటలు పెట్టుకుంటే ఎంత సేపైనా ట్రాఫిక్‌లో ఉండచ్చు...నేను సూడు...ఫోన్లో లెక్క 🙂👌❤️👍 కొట్డ్తాన్దుకు కార్ర్లో బ్లూటూత్ మీద కొట్టడానికి ట్రై సేస్తున్నా...లేట్ అయిపోయి ఇయ్యాల రెండు నిమిషాల్ల స్నానం చేషిన...అసలు రోజు అంతే ఒకటి, రెండు నిమిషాల్ల స్నానం చేసి ఒచ్చుడు...ఈ sunday తనివి తీర స్నానం సేస్తా...అయ్యా గీ తల సూడు...దువ్వుకోను కూడా దువ్వుకోలే ... ఎవడో ఫుల్లు తలంతా నిమిరిండా అన్నట్టుంది...అమ్మ సూస్తే పిచ్చా క్లాస్ పీకుతది...ఆర్య పాట నెక్స్ట్...wow సూపర్ సాంగ్. ..dsp..రైట్ సైడ్ ఏందది...ఏదో అంబులెన్స్ సౌండ్...ట్రాఫిక్ల అంబులెన్స్ అంటే సానా దురదృష్టం candidate అన్నట్టు...ప్చ్...అంతా మన కర్ర్మా, జాతకమా అని అనిపిస్తోంది...ధర్మంగా ఉండాలె...ఇంకా ఎంతసేపురా ఈ signal...హైదరాబాద్ల అయితే సిగ్నల్స్ ఉన్నా గల్లీల కెల్లి ఒచ్చేస్తరు...మొన్నైతే cabఓడు..అరూహ్ అఫ్జల్ గంజ్ సే అండు...పది నిమిషల్లా ఒచ్చేసిండు ...కోటి గల్లీల కెల్లి...ఏడ సూషినా రియల్ ఎస్టేట్ పోస్టర్లే...1cr...2cr...మధ్యల ర్సీబీ పోస్టర్రు.. ఒక్కసారి గూడ గెల్వలే…RCB ఫ్యాన్ టవలెసుకుని కూసుండు నెత్తిమీద...ఈ మెయిల్ ఏంది ...ఈ సుబ్బారావు ఎవడు మెయిల్ల...ఈ మధ్య ఈ pronouns ఒకటి...he/him అని...she/her అని రాస్తున్రు...అందరికే ఈది ఫ్యాషన్ అయిపోయింది...ముందు ముందు అన్నింటికే pronouns pedtharu…స్వీట్ షాపులకి కూడాస్ పెట్టేస్తరు..:బాదుషా he గులాబ్ జామున్...she..:అని...వార్నీ...ఏమైపోతుందో లోకం...సర్లే...పాటలిందాం
Comments
Post a Comment