అదోక తిరుపతి దెగ్గర చిన్న ఊరు...చలికాలం...కానీ ఊళ్ళో వాతావరణం చాలా వేడిగా, వాడిగా ఉంది…అక్కడ జి ఎన్ రెడ్డి గారి వర్గానికి, ఎస్ పీ రెడ్డి గారి వర్గానికి పెద్ద గొడవైంది...కత్తులు, కటార్లు, మెష్షులు, క్లాకులు, మెమొరీలు బయటకి వచ్చాయి... ఎవరి వాదనలు, టెస్ట్ కేసులు వారు పంచాయతీ ముందు పెట్టుకున్నారు...ఊరిలో సగం మందికి జీఎన్ఆర్లు, సగం మందికి ఎస్పీఆర్లు న్యాయమని అనిపించారు...పంచాయితీలో కూడా సగం అటు, ఇటు నిలిచారు...ఇంకా అధ్యక్షుడు రాఘవరావు గారు తీర్పివ్వాలి...ఆయన విదేశాల నుంచి వచ్చారు…తీర్పు ఇవ్వబోయారు...ఇంతలో జనంలో కలకలం మొదలైంది... ఓక పెద్దాయన సెలవిచ్చారు...రావు గారూ, మీరు గొప్ప సీనియర్ దర్శకులు...ఎన్నో తీర్పులిచ్చారు...కానీ ఇది చాలా జటిలమైనది...మీరు కాదు అని వారించారు...ఎవరో వెళ్లి కైకాల సత్యనారయణ గారిని పిలిపించారు...ఆయనగారు... యముండ అని గర్జించారు, వచ్చారు, చూసారు…కష్టం అని తేల్చేశారు...ఇంతలో ఎవరో గుర్రపు బండిలో దిగారు... .పెద్ద మీసం, ఆజానుబాహుడు, చేతిలో పెద్ద ఖడ్గంతో బొబ్బిలి బ్రాహ్మన్న దిగాడు...ఓహో ఇది బొబ్బిలి కాదా...నా ఏరియా కాదు అని చెప్పి వెళ్ళిపోయారు...హ హ హా..మనిసన్నాక కూసింత క...