సువాసినులూ వారి సుబ్బారావులు

 వత్తులు అనగానే ఠక్కున సంచిలో చూస్తే మూల వత్తుల గుత్తి ఉంది..:తీసి అందించాడు…ప్రమిదలు అనగానే..:ప్రమిదలా అని చూస్తే సంచిలో మూలన ఉన్నాయి…నూనె…నెయ్యి..అగరబత్తి…అగ్గిపెట్టె..:అది సంచి కాదు…మహాసంచి..:పుష్కరాలకు విజయవాడలో ఆటో లోనుంచి దిగిన బంధువులకన్నా ఎక్కువ వస్తువులున్నాయి ఇందులో…వరుసగా అన్నీ తీసి అందించాడు..cpu instruction కమాండు కి డేటా పరిగెత్తుకొచ్చినట్టు…ప్రమిదలో నూనె వేసి వత్తులు వేసింది…మరి నెయ్యెందుకో అని అనుకునే లోపే అందులో కొద్దిగా నెయ్యి వేసింది..:నెయ్యి దీపం..:ఖర్చు తక్కువలో…ఆహా అనుకునే లోపే గాలి బాగా వేస్తోంది మరి అగ్గిపుల్ల నిలవడం ఎలా అని అనుకుంటుండగానే అగరపువత్తి వెలిగించి దానితో వత్తులు వెలిగించింది…గ్లోబల్ క్లాక్ నుండి లోకల్ క్లాక్ కి వచ్చినట్టు…అసలు ముందు రాగానే అప్పటికే అక్కడ నాగదేవత ప్రతిమ ముందు ఎంతో మంది సువాసినులు పూజచేసిన సామగ్రి నిండి పోయి ఉన్నది..ఇక్కడ ఇప్పటికే హై యుటిలైజేషన్ కదా..:ఎక్కడ ప్లేస్ చేస్తుంది అని అనుకుంటుండగానే కొన్ని కొద్దిగా పక్కకు జరిపి భూ సింహాసనం మీద కూర్చున్నది…నీళ్లు అంది…నీళ్లెక్కడ అని చూసే లోపే సంచిలో అని సైగ చేసింది.::చూస్తే ఒక డబ్బాలో నీళ్లు…ఇవ్వగానే అక్కడ ఉన్న కొద్ది స్థలంలో శుభ్రం చేసి, ముగ్గు వేసి (ఎస్ అది కూడా ఉంది ఆ మహా సంచిలో) కుంకుమ అద్ది దాని మీద షోడశోపచార సమేతంగా పూజ చేసేసింది…కర్పూరం, చిన్న అరటి పండ్లు, హారతికి ఇంకో ప్రమిద…ఇవి ఓకే…స్టీలు డబ్బాలో నువ్వు లడ్డూలు…ఇవెప్పుడు చేసింది అనుకునేలోపే…పాల ప్యాకెట్ తీసింది…నాగదేవత మీద పోయడానికి…దొరికింది..:కత్తెర ఇల్లా…ఎలా కట్ చేస్తుంది పాల పాకెట్టు…పక్కవాళ్ళ దెగ్గర ఉంటుందిలే అడుగుతుందిలే అనుకున్న ఆ ఆలోచన పసిగట్టేసి..:అలా చేస్తానా..ఎప్పుడైనా చేసానా? ఎంత అవమానం..:అనేట్టుగా వో చూపు విసిరేసి అగరపువత్తి వెనక పుల్లతో కసక్కున కట్ చేసేసింది రజినీకాంతులా…జయ జయ హే అని పాడాలనుకున్నా సమయం లేదు…సరే మొత్తం ప్యాకెట్ పోసెయ్యలేము కదా అక్కడ శుభ్రత పోతుంది…అంతేకాక అన్ని పాలు పోసేస్తారా ఎవరన్నా? డీసీ, జీనస్ కన్నా పెద్ద ఆప్టిమైజర్ ఇక్కడ..:కాసిని పోసాక మిగతా పాలు ఏం చేస్తుంది…మహాసంచిలో లీక్ అవుతాయి కదా అని క్లాసులో సైన్స్ ఎక్స్పరిమెంటు చూసినట్టు చూస్తుంటే, ఇందాకటి నీళ్ళ డబ్బా ఖాళీ చేసి అందులో పోసింది..:ఇది పెర్ఫెక్టు ప్లానింగ్ ఆఫ్ ఇండియా…ఫోను.::ఇన్స్ట్రక్షన్..:తీసి ఇచ్చాడు…ఇప్పుడు కార్పెంటరుకి ఫోన్ అవసరమా అనుకునేలోపు ఫోనులో సుబ్రహ్మణ్య స్తోత్రం తీసి భక్తి తో చదివేసింది 

..టెక్నాలజీ అండీ…పక్కన ఒక చిన్నోడు వాళ్ళ అమ్మ చేసిని ఇలాంటి పూజే వాళ్ళ నాయనమ్మకి వీడియో కాల్ లో చూపిస్తున్నాడు..:స్పీకర్లో ఆవిడ ఆ బాగుంది అని సాటిస్ఫ్యాక్షన్ తో పాస్ మార్కులు వెయ్యడం…పిల్లవాని తల్లి గర్వంగా బయటికి కనిపించని ఒక చిరు దరహాసం ఇవ్వడం..పిల్లవాని డమ్మీడీ మొహంలో టేప్ అవుట్ అయినంతగా, వంద పవనముక్తాసనాలు ఒకేసారి వేసినంతగా ఊపిరి పీల్చుకున్నాడు…చుట్టూ చూస్తే ఎంతో మంది సువాసినీలు ఇదే తరహాలో నాగులచవితి పూజ చెయ్యడం…వాళ్ల యజమానులు వెనక కొద్దిగా భక్తితో మరింత భయంతో చేతులు కట్టుకుని క్షత్రియపుత్రుడు లో కమలహాసన్ వాళ్ళ నాన్నగారైన శివాజీ గణేశన్ వెనక వినయంగా నుంచున్నట్టు నుంచొని కొద్దిగా ఆశ్చర్యంతో, మరికొద్ది విస్మయంతో చూస్తూ ఇన్స్ట్రక్షన్స్ కి తగ్గట్టుగా హై పెర్ఫార్మన్స్ తో డేటా అందిస్తూ ఫ్లో లో రన్నై పోతున్నారు..:ఇటు ఈ సువాసినులను, వారి సుబ్బారావులను ఆ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామివారు చల్లగా చూడాలని ఆశిస్తూ…

Comments

Popular posts from this blog

The Physical Design Geetha

బద్ధకస్తులు కారణజన్ములు

Unplugged