లైవ్ వైర్

 


పది రూపాయల బెట్టు పెట్టుకొని పది మంది పదమూడు ముక్కలాట పేకాడుతున్నారు..లైఫ్  లేదు జోకర్ లేదు సరికదా ఏ రెండు ముక్కలూ కలవడం లేదు..డ్రాప్ కి అవకాశం లేదు ..పక్కనవాడు వేసిన ముక్క ఆల్రెడీ రెండున్నాయి అవే …డ్రాపుdaama అనుకుంటూ సరే చూద్దాం అని ముక్క తీస్తే రంగురంగుల దుస్తులతో విజయనగర సామ్రాజ్యంలో విదూషకుడి వేషంలో నవ్వుతూ వచ్చిన జోకర్ ముక్క చూస్తే అప్రయత్నంగా ముఖం మీద ఒక చిరునవ్వు వచ్చి వాలుతుంది…ఎంతో గంభీరంగా సాగే థియేటర్ లో కిక్కురుమనకుండా సినిమాలో మమేకమై మునిగిపోయి చూస్తున్న సమయంలో అనుకోకుండా ఒక బ్రహ్మానందమో ధర్మవరపు సుబ్రహ్మణ్యమో వెన్నెల కిశోరో వస్తే మనస్సు తేలికపడుతుంది…హాయిగా అనిపిస్తుంది…అప్రయత్నంగా, రాబోయేది హాస్య సన్నివేశం అని తెలిసి అది రాకుండానే ఒక చిరు దరహాసం వచ్చి చేరుతుంది…ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం ఎండలో నడవాల్సి వచ్చి విజయవాడ ఉక్కపోతలో చమటలు జలపాతంలా కారిపోతుంటే టుర్రు మంటూ ఒక బజాజ్ చేతక్ మీద వచ్చి లిఫ్టు కావాలా బాబాయ్ అని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఆ ఫీలింగే వేరప్పా…పిచ్చ ఫార్మ్ లో ఉన్న మాథ్యూ హేడెన్ జస్టిన్ లాంగర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ భయంకరంగా కొడుతుంటే, బౌలర్ల భుజాలు వాలిపోయుంటే ఫీల్డర్లు నీరసించిపోయుంటే హెడెన్ కొట్టిన స్క్వేర్ కట్ ని చిరుతపులలా ఆపిన జాంటీ రోడ్స్ ఆ ఒక్క ఫీల్డింగ్తో జట్టులో అందరిలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపుతాడు…గంటల తరబడి క్యూ కాంప్లెక్స్ దెగ్గర క్యూ లో నుంచొని కాళ్ళు చేతులు శరీరమంతా ఇహ నువ్వెవరో నేనెవరో నీకు నాకు సంబంధం లేదు అంటుంటే దర్శనం ఎప్పుడవుతుందా అని లైన్ ఎప్పడు కదులుతుందా అని ఆలోచనల్లో ఉంటే ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద అని ఎవరో అరిస్తే ఆ అరుపుతో ఒక్కసారి మళ్లీ శక్తి నింపుతుంది ఇంకో గంటవరకూ ఛార్జ్ అవుతుంది…ఎప్పడు కలిసినా మాట్లాడినా మెసేజ్ చేసినా ఇలాంటి శక్తిని నింపుతూ మనస్సులో ఆహ్లాదాన్ని ముఖంలో చిరునవ్వు నింపే ఒక మిత్రుడు ఉండడం ఎంతో అదృష్టం…అటువంటి వంశీ దొరకడం మనందరి అదృష్టం…మనం దొరకడం వాడి అదృష్టం కూడా…ఆటల్లో మోసం చేస్తున్నా మాటల్తో మాయచేస్తున్నా మాయలోడని తెలిసి కూడా కల్మషం కపటం లేని ఆత్మీయ స్నేహితుడు అనిపించే మోహనుడు వీడు…కాలనీ లో వేసవిలో వచ్చే వాటర్ ట్యాంకర్ లా అందరిలో చిరునవ్వును ఉత్సాహాన్ని హాయిని నింపే సుబ్బారావు వీడు…జన్మదిన శుభాకాంక్షలు లైవ్ వైర్ వంశీ మోహన్ 🙂


చూడు కట్టప్పా…ఏదో స్పెషల్ డే బర్త్ డే అని కొద్దిగా బలూన్ ఊదుతాం ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతాం విసనకర్ర విసురుతాం నిచ్చనేసి ఆకాశం అందలం ఎక్కిస్తాం…అంత మాత్రం చేత ఇది నీ 3bhk ఫ్లాట్ కాదు నీ సొంత నియోజకవర్గం కాదు…తెల్లారగానే మళ్లీ భార్య పిల్లలచేత టీంలో కింద వాళ్ళ చేత పై వాళ్ల చేత ట్రాఫిక్ లో పక్క వాహనచోదకుల చేత కాఫీ షాప్ లైన్లో వెనక వాళ్ళ చేత మళ్లీ తిట్టించుకోడమే…అంతా షరా మామూలే…

Comments

  1. Nice Satya, well written

    ReplyDelete
  2. From the Bajaj Chetak lift in Vijayawada heat to the Tirumala Govinda energetic cheer, your brilliant analogies brought every single scene to life like a blockbuster movie screen :)
    what a masterpiece of a tribute, Satya!
    Happy birthday Vamshi!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ugadi Rasi Phala for VLSI folks

RetirEMigration Limits

Who Am I?